రాజధాని ఏదో తెలీదా?అయితే నన్ను అడగొద్దు.. నేను చెప్పను!

YSRCP-MLA-Monditoka-Jagan-Mohan-Raoఎన్టీఆర్‌ జిల్లాలో నందిగామ వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గురువారం తన నియోజకవర్గంలో ఇంటింటికీ జగనన్న స్టిక్కర్స్ అంటించేందుకు వెళితే ప్రజలు ఆయనతో ఓ ఆట ఆడేసుకొన్నారు. ఆయన ఓ ఇంటికి వెళ్ళి స్టిక్కర్ అంటించబోతే ఆ ఇంటి యజమాని అభ్యంతరం చెప్పారు. తర్వాత వారిద్దరి మద్య జరిగిన సంభాషణ చాలా ఆసక్తికరంగా సాగింది.

ADVERTISEMENT

పౌరుడు ప్రశ్న: సార్ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏదో చెప్పండి.

వైసీపీ ఎమ్మెల్యే మొండితోక సమాధానం: రాజధానా… మూడు కదా?

పౌరుడు: ఏవండీ?

వైసీపీ ఎమ్మెల్యే: మీకు తెలీదా?

పౌరుడు: తెలీదండి. అందుకే అడుగుతున్నాను.

వైసీపీ ఎమ్మెల్యే: తెలీకపోతే అడక్కూడదు.

పౌరుడు: అదేంటి సార్ తెలీకపోతేనే కదా ఎవరైనా అడిగి తెలుసుకొంటారు?

వైసీపీ ఎమ్మెల్యే: మీకు తెలీకపోతే ఇక ఆ విషయం వదిలేసేయండి. దాని గురించి తెలుసుకొనే ప్రయత్నం చేయొద్దు. నన్ను అడక్కండి. అడిగినా నేను చెప్పను.

పౌరుడు: మేము ఓట్లు వేసి గెలిపించాము గాబట్టే మిమ్మల్ని అడుగుతున్నాము సార్.

వైసీపీ ఎమ్మెల్యే: మీరు మాకు ఓట్లు వేశారా? మీ ఓట్లతో నేను గెలిచానా? మీరెప్పుడు నాకు ఓట్లు వేశారు?

పౌరుడు: మేము మీకు ఓట్లు వేయకపోతే మీరెలా గెలిచి ఎమ్మెల్యే అయ్యారు? మేము మీకు ఓట్లు వేయకపోతే మా ఇంటికి ఎందుకు వచ్చారు?

వైసీపీ ఎమ్మెల్యే: నా ఇష్టం నేను వస్తాను. నా నియోజకవర్గం ఎవరింటికైనా వెళ్ళే హక్కు నాకుంది.

పౌరుడు: జగనన్న ఇక్కడే ఇల్లు కట్టుకొంటానని అన్నాడు. ఇక్కడే రాజధాని ఉంటుందని అన్నాడు. అధికారంలోకి వచ్చాక మాట మార్చి మూడు రాజధానులంటున్నాడు. పోనీ అవయినా కట్టారా?” అంటూ నిలదీసేసరికి మొండితోక ముడుచుకొని అక్కడి నుంచి ఆగ్రహంగా వెళ్ళిపోయారు.

కర్నూలులో న్యాయరాజధాని, విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పుకొంటూ రాయలసీమ, ఉత్తరాంద్ర జిల్లాల ప్రజలను వైసీపీ నేతలు మభ్యపెట్టగలిగారు. కానీ గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలు అమరావతి గురించి ఈవిదంగా ఎక్కడికక్కడ నిలదీస్తుంటే సమాధానం చెప్పలేక ఈవిదంగా గొడవపడుతున్నారు.

అయితే ప్రజలపై ఎదురుదాడి చేసి వాళ్ళ నోళ్ళు మూయించవచ్చు. లేదా తమని ఈవిదంగా నిలదీస్తున్నందుకు పోలీసులతో వారిపై అక్రమకేసులు బనాయించవచ్చు. కానీ రెండు జిల్లాలలో ప్రజలు తమపై ఇంత ఆగ్రహంగా ఉన్నారనే విషయం వైసీపీ నేతలకు బాగా తెలిసివస్తోంది. అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం తమను మోసం చేసిందని కృష్ణా, గుంటూరు ప్రజలు భావిస్తుండటం ఆ రెండు జిల్లాలకు చెందిన వైసీపీ నేతలకు తీవ్ర ఆందోళన కలిగించే విషయమే. తమ అధినేత నెలనెలా ఎంత గట్టిగా బటన్ నొక్కుతున్నా రేపు ఎన్నికలలో ప్రజలు తమకు ఓట్లు వేయకపోవచ్చని వైసీపీ నేతలు గ్రహించే ఉంటారు.

ADVERTISEMENT
Latest Stories