చిరిగిన చొక్కా అయినా వేసుకో పర్వాలేదు కానీ ఓ మంచి పుస్తకాన్ని తప్పక కొని చదువు.. అనేది పాత నానుడి. చిరిగిన చొక్కా అయినా వేసుకో పర్వాలేదు కానీ తప్పనిసరిగా ఓ లేటెస్ట్ మోడల్ మొబైల్ ఫోన్ కొనుక్కో.. లేకుంటే అప్రదిష్ట! అనేది నేటి నానుడి.
కానీ తల్లి తండ్రుల ఆర్ధిక పరిస్థితి ఏమిటి? ఈ వయసులో ఖరీదైన ఐ ఫోన్ అవసరమా? అని ఆ యువకుడు ఆలోచించలేదు. ఐ ఫోన్ కొనివ్వకపోతే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డాడు.
కొండపై నుంచి కాలు జారి చనిపోయాడు. కొడుకుని కాపాడబోయిన తండ్రి చనిపోయాడు. కళ్ళెదుటే భర్త, కొడుకు కొండపై నుంచి కిందపడి చనిపోవడం చూసి తట్టుకోలేక తల్లి కూడా కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది!
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ జిల్లాలో ఖవడ్యా డొంగర్‌లో ఈ విషాద ఘటన జరిగింది. దాదాపు మూడు గంటల పాటు తల్లితండ్రులు, పోలీసులు, కొండ అంచున నిలబడిన కునాల్‌ను బ్రతిమాలినా అతను మొండిపట్టు వీడలేదు. చివరికి ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు!
దేశంలో మొబైల్ ఫోన్ పిచ్చి ఎంతగా ముదిరిపోయిందో… దాని వలన కుటుంబాలు ఏవిధంగా నాశనం అవుతున్నాయో అర్థం చేసుకునేందుకు ఈ విషాద ఘటన ఓ తాజా ఉదాహరణ.
తల్లితండ్రులు అప్పోసొప్పో చేసి పిల్లలకు మొబైల్ ఫోన్ కొనిస్తే, ఆ తర్వాత వాటితో సెల్ఫీలు, రీల్స్ అంటూ జీవితాలు నాశనం చేసుకునే యువత కోకొల్లలున్నారు.
పసితనంలోనే పిల్లల చేతికి మొబైల్ ఫోన్లు ఇచ్చే తల్లితండ్రులు, టీనేజ్ వయసులో మొబైల్ ఫోన్ సరదాలు, ఆకర్షణ, స్కూలు, కాలేజీ దశలోనే మొబైల్ ఫోన్ కలిగి ఉండటం ప్రతిష్టాత్మకంగా భావించడం వంటివి అనేకం ఇలాంటి విషాదాలకు కారణాలుగా కనిపిస్తున్నాయి.
ఇవే కారణాలని తెలిసి ఉన్నా ఇది నయం చేయలేని క్యాన్సర్ వ్యాధిలా మారి చివరకు ఈవిధంగా ప్రాణాలు బలి తీసుకుంటోంది.
ఐఫోన్ 15 కోసం మూడు ప్రాణాలు బలి..
సంభాజీనగర్‌కు చెందిన 18 ఏళ్ల యువకుడు ఐఫోన్ 15 కొనివ్వాలని డిమాండ్ చేస్తూ ఖవ్ద్యా కొండపై తల్లిదండ్రులతో గొడవపడి కొండపై నుంచి దూకుతానని బెదిరించాడు.
3 గంటల పాటు తల్లిదండ్రులు బతిమిలాడినా వినలేదు. చివరకు తండ్రిని తనతో పాటు లాగడంతో ఇద్దరూ… pic.twitter.com/aDaA1xNZZK
— greatandhra (@greatandhranews) August 21, 2026





