ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే ముందుగా రాజధాని అమరావతి, పోలవరం, భోగాపురం ఎయిర్ పోర్ట్, ఇప్పుడు వెలిగొండ ప్రాజెక్టు కనిపిస్తుంటాయి. కానీ చడీ చప్పుడూ లేకుండా రాష్ట్రంలో ఇంకా చాలా అభివృద్ధి పనులే జరుగుతున్నాయి.
వాటిలో సీలేరు జల విద్యుత్ కేంద్రం కూడా ఒకటి. ఇది అల్లూరి సీతారామరాజు జిల్లాలో, గూడెం కొత్తవీధి మండలంలోని దట్టమైన తూర్పు కనుమల అటవీ ప్రాంతంలో ఉంది.
ఆంధ్రప్రదేశ్-ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రవహించే సీలేరు నదిపై ఈ ప్రాజెక్ట్ కాంప్లెక్స్‌ను నిర్మించారు. ఇది విశాఖపట్నం నగరం నుండి సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
దీనిలో పొల్లూరు (లోయర్ సీలేరు) మొత్తం ప్రస్తుతం సామర్ధ్యం 460 మెగావాట్లు. దీనిలో ఒక్కోటి 115 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4 యూనిట్లు పనిచేస్తున్నాయి.
ఇప్పుడు వాటికి అదనంగా ఒక్కోటి 115 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2 యూనిట్లునిర్మిస్తోంది. ఈ రెండు యూనిట్లు ఈ ఏడాది అక్టోబరు నాటికి అందుబాటులోకి రానున్నట్లు ఏపీ జెన్‌కో అధికారులు తెలిపారు. అవి పనిచేయడం ప్రారంభిస్తే ఏపీకి అదనంగా మరో 230 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది.
ఇదికాక ఎగువ సీలేరు వద్ద మరో కొత్త ప్రాజెక్టు పనులు కూడా చకచకా సాగుతున్నాయి. అక్కడ 1,350 మెగావాట్ల భారీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇతర జల విద్యుత్ ప్రాజెక్టులతో పోలిస్తే ఇది చాలా ప్రత్యేకతమైనది.
పగటిపూట సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయినప్పుడు దాంతో దిగువన ఉన్న డొంకరాయి రిజర్వాయర్ నుండి నీటిని ఎగువన ఉన్న గుంటవాడ రిజర్వాయర్‌లోకి పంపుల ద్వారా ఎత్తిపోస్తారు.
రాత్రి వేళల్లో లేదా విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు, అదే నీటిని కిందకు వదులుతూ తొమ్మిది రివర్సిబుల్ టర్బైన్ల (ఒక్కొక్కటి 150 మెగావాట్స్) విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. అంటే అదనంగా పైసా ఖర్చు పెట్టకుండా 1,350 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్న మాట!
ఈ రెండూ కాకుండా పోలవరం జల విద్యుత్తు ప్రాజెక్టును ఈ ఏడాది డిసెంబర్‌లోగా ట్రయల్ రన్ చేసేందుకు జెన్‌కో అధికారులు ప్రయత్నిస్తున్నారు. కానీ దీని కోసం పోలవరం ప్రాజెక్టులో కనీసం 41.5 అడుగుల నీటి మట్టం ఉండాలి. కనుక ట్రయల్ రన్స్ కాస్త ఆలస్యమైనప్పటికీ ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి మరో 960 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుంది.
గతంలో వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళ పాలనలో ఏమీ చేయకపోయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో వెనకబడిపోయిందని దుష్ప్రచారం కూడా చేస్తోంది.
కానీ సిఎం చంద్రబాబు నాయుడు మాత్రం చడీ చప్పుడూ లేకుండా ఒకే సమయంలో రాష్ట్రంలో ఇన్ని అభివృద్ధి పనులు జరిపిస్తున్నారు. ఇవన్నీ పూర్తయితే మిగిలిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌తో పోటీ పడాల్సివస్తుంది.





