బీసీ రిజర్వేషన్లు…ఎవరి కొంప ముంచబోతున్నాయో.?

Supreme Court and Telangana government clash over 42% BC reservation decision

తెలంగాణ రాజకీయాలలో మొదలైన ఈ బీసీ రిజర్వేషన్ల రాజకీయం రాజకీయ పార్టీలను దాటి న్యాయస్థానాలకు చేరాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 % రిజర్వేషన్ అంటూ రేవంత్ సర్కార్ విడుదల చేసిన జీవో అధికార పార్టీని కోర్ట్ మెట్లెక్కించాయి.

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో చట్ట విరుద్ధమని, బీసీలకు 42 % రిజర్వేషన్ అంటే అది రిజర్వేషన్లు 50 % మించకూడదు అనే చట్టాన్ని ఉల్లంఘించడం కిందకే వస్తుందంటూ ఇటు హై కోర్ట్ లో అటు సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలయ్యాయి.

ADVERTISEMENT

అయితే ఈ పిటిషన్ ను అసలు విచారణకు స్వీకరించలేమంటూ సుప్రీం కోర్ట్ పిటిషన్ ను కొట్టేసింది. హై కోర్ట్ విచారణలో ఉన్న కేసు పై సుప్రీం కోర్టులో పిటిషన వేయడమేంటి అంటూ పిటిషినర్ ను నిలదీసింది ధర్మాసనం.

అయితే సుప్రీం తమకు వ్యతిరేకంగా ఎటువంటి తీర్పును వెల్లడిస్తుందో అన్న ఆందోళనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది కొంత మేరకు ఊరటనిచ్చే అంశమే అవుతుంది. అయితే ఈ పిటిషన్ లను విచారణకు స్వీకరించిన హై కోర్ట్ ఈ కేసును ఈనెల 8 కి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

న్యాయస్థానాలలో ఇలా సాగుతున్న ఈ బీసీ రిజర్వేషన్ల పంచాయితీ ఇక తెలంగాణ రాజకీయాల్లో ఎవరి కొంప ముంచబోతుందో అన్న చర్చ జరుగుతుంది. తీర్పు కాంగ్రెస్ కు అనుకూలంగా వస్తే అది రేవంత్ సర్కార్ విజయంగా మారుతుంది, అలాగే బీసీ ఓట్ బ్యాంకు మొత్తం కాంగ్రెస్ కు అనుకూలం అవుతుంది.

పరిస్థితి ఇలా కాంగ్రెస్ కు సానుకూలంగా ఉంటే అది ప్రతిపక్ష బిఆర్ఎస్ కు ప్రతిపక్షం లోకైనా రావాలనుకుంటున్న బీజేపీ కి పెద్ద ఎదురు దెబ్బె అవుతుంది. అలా కాకుండా న్యాయస్థానంలో తీర్పు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే బీసీ రిజర్వేషన్లు కేవలం రేవంత్ సర్కార్ రాజకీయ స్టంట్ అంటూ ప్రతిపక్షాలు అధికార పక్షం పై ఆరోపణలు మొదలు పెడతాయి.

ఇది ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే అంశంగా మారుతుంది. అలాగే రేవంత్ చిత్తశుద్ధి మీద కూడా విమర్శలు ఎదురవుతాయి. కాబట్టి స్థానిక సంస్థలలో బీసీ లకు 42 % రిజర్వేషన్ల లొల్లి అధికార – ప్రతిపక్షాల మధ్య గెలుపు అవకాశాన్ని 50 – 50 గా మార్చబోతుందా.?

ADVERTISEMENT
Latest Stories