విద్యావ్యవస్థపై విమర్శలు తేలిక.. సంస్కణలు కష్టం

Nara Lokesh on AP education reforms

అధికారంలో ఉన్నప్పుడు సమర్ధంగా పాలన సాగించడం ఎంత కష్టమో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు చేయడం అంత తేలిక. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో, ఇప్పుడు ప్రతిపక్షంలోకి మారిన తర్వాత ఏవిధంగా వ్యవహరిస్తోందో చూస్తే ఇది అర్ధమవుతుంది.

ఐదేళ్ళు సిఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలీకపోవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అలాంటి వ్యక్తి యూడిఐఎస్ఈ వంటి లోతైన అంశం గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగానే ఉంతుంది.

ADVERTISEMENT

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 2023-24లో 40.50 లక్షలు ఉండగా, 2025-26 నాటికి 34.93 లక్షలకు తగ్గిందని జగన్‌ విమర్శించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ వాదన భిన్నంగా ఉంది.

ఈ విద్యా సంవత్సరంలో 1.10 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మారారని తెలిపారు. అంటే తాను చేపట్టిన పలు సంస్కరణల వలన తల్లితండ్రులలో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెరిగిందన్నారు. అందువల్లే ‘ఆర్‌జీయుకేటి’ ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటడ్‌ బీ.టెక్ ప్రోగ్రామ్‌కు తాత్కాలికంగా ఎంపికైన 4,040 మంది విద్యార్థుల్లో 3,907 మంది ప్రభుత్వ పాఠశాలల నుంచే ఎంపికయ్యారని మంత్రి నారా లోకేష్‌ తెలిపారు.

అయితే ప్రతీ విద్యా సంవత్సరంలో కొంతమంది విద్యార్థులు చదువు పూర్తిచేసి తదుపరి దశకు వెళ్తారు. అలాగే కుటుంబాల వలసల కారణంగా పాఠశాలలు మారతారు. లేదా ఇతర కారణాల వలన వేరే విద్యాసంస్థలకు మారుతుంటారు. ఇది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ అన్నారు.

ఈ కారణంగా పాఠశాలలో చేరే విద్యార్ధుల సంఖ్యలు మారుతూనే ఉంటాయి. కానీ ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పించి, నాణ్యమైన విద్య అందిస్తే తప్పకుండా కొత్త విద్యార్ధులు వస్తారని, ప్రస్తుతం తాము అదే చేస్తున్నామని మంత్రి నారా లోకేష్‌ చెప్పారు.

రాష్ట్రంలో మొత్తం విద్యార్థుల్లో ప్రభుత్వ పాఠశాలల వాటాను పరిశీలిస్తే 2025-26లో 41.40 శాతం కాగా, 2026-27లో అది 42.34 శాతానికి పెరిగింది. అంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధుల సంఖ్య పెరుగుతోందన్న మాట!

ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధుల సంఖ్య తగ్గారనే జగన్‌ విమర్శలను పూర్తిగా కొట్టిపారేయలేనట్లే, విద్యా సంస్కరణల తర్వాత ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు మారే విద్యార్ధుల సంఖ్య పెరిగిందనే వాస్తవాన్ని కూడా విస్మరించలేము.

మంత్రి నారా లోకేష్‌ చేపడుతున్న విస్తృత విద్యా కార్యక్రమాల్లో ఉపాధ్యాయ శిక్షణ, పాఠ్యప్రణాళికలో మార్పులు, 29 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి అధ్యయనం కొరకు ఫిన్లాండ్‌కు పంపడం, బాలికల కోసం కొత్తగా ప్రారంభించిన షీ ప్లే’ వంటి కార్యక్రమాలు.. ప్రైవేట్ పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేస్తోంది.

ప్రస్తుతం ఉన్న 42.34 శాతం 50 శాతానికి చేరుకోగలిగితే అప్పుడు ప్రభుత్వ-ప్రైవేట్ పాఠశాలలు సమ ఉజ్జీలుగా మారుతాయి. ఒక్కసారి ‘లెవెల్ ప్లే’ మొదలైతే ప్రభుత్వ పాఠశాలలు దూసుకుపోవడం పెద్ద కష్టం కాదు. కనుక ఇప్పుడు చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీఓ పెద్ద లక్ష్యం, ఓ శాశ్విత మార్పు కోసం చేస్తున్నవిగానే భావించవచ్చు.

విద్యార్ధుల సంఖ్యా, మెరుగైన ఫలితాలు వస్తే అవే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మార్పుకి అసలైన కొలమానం. మంత్రి నారా లోకేష్‌ ప్రవేశ పెడుతున్న విద్యా సంస్కరణలకు కూడా అవే అసలైన కొలమానం.

ADVERTISEMENT
Latest Stories